భారతదేశం, మే 29 -- Raidurg Land Auction : హైదరాబాద్ మహానగర రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త చరిత్ర నమోదైంది. నగరంలోని ఐటీ హబ్‌గా పేరొందిన రాయదుర్గం ప్రాంతంలో జరిగిన భూముల ఈ-వేలంలో ఊహించని రీతిలో భారీ ధర పలికింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ వేలంలో ఎకరం భూమి రికార్డు స్థాయిలో దాదాపు రూ.237 కోట్ల ధర పలికింది. ప్రభుత్వ నిర్ణయించిన కనీస మద్దతు ధర (రిజర్వ్ ప్రైస్) రూ.139 కోట్లతో పోలిస్తే ఇది ఏకంగా 70.5 శాతం ఎక్కువ కావడం విశేషం.

రాయదుర్గంలోని ప్రైమ్ లొకేషన్‌లో ఉన్న ప్లాట్ నంబర్ 1A, 1/F పరిధిలోని 6.29 ఎకరాల బహుళ ప్రయోజన (మల్టీ-యూజ్) భూమి కోసం టీజీఐఐసీ ఈ వేలం నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లు, అగ్రశ్రేణి నిర్మాణ సంస్థలు ఈ వేలంలో పోటాపోటీగా పాల్గొన్నాయి. తీవ్రమైన ప...