Hyderabad heavy Rain : హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం - భారీగా ట్రాఫిక్ జామ్, రోడ్లన్నీ జలమయం
భారతదేశం, జూన్ 9 -- Hyderabad heavy Rain : భాగ్యనగరంలో మంగళవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరాన్ని ముంచెత్తుతూ కురిసిన భారీ వర్షం కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే పీక్ అవర్స్‌లో ఈ వర్షం పడటంతో నగర జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
నగరంలోని ప్రధాన రహదారులు, ముఖ్యమైన జంక్షన్లలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముఖ్యంగా హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ఖైరతాబాద్‌తో పాటు సికింద్రాబాద్‌లోని ముషీరాబాద్, మారేడ్‌పల్లి వంటి ప్రాంతాల్లో వాహనదారులు ఇళ్లకు చేరుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.