భారతదేశం, ఆగస్టు 31 -- Nurse Rape Murder Case : రంగారెడ్డి జిల్లా పరిధిలో నర్సుగా పని చేస్తున్న 21 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో పోలీసులకు కీలక పురోగతి లభించింది. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి ఎండీ సనావుల్లా (34) అనే బైక్ మెకానిక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

తుక్కుగూడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి నివాస గదిలోకి చొరబడిన నిందితుడు, సుత్తితో సదరు యువతి తలపై తీవ్రంగా కొట్టి.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

"21 ఏళ్ల నర్సుపై అత్యాచారం, హత్యకు ఒడిగట్టిన నిందితుడిని మా ప్రత్యేక బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ కేసులోని పూర్తి వివరాలను ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడిస్తాం" అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

భద్రాద్రి కొత్తగ...