Hyderabad Book Fair 2026 : పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్ - డిసెంబర్ 18 నుంచి 'హైదరాబాద్ బుక్ ఫెయిర్'
భారతదేశం, అక్టోబర్ 18 -- Hyderabad Book Fair 2026 : పుస్తక ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే హైదరాబాద్ పుస్తక మహోత్సవానికి (హైదరాబాద్ బుక్ ఫెయిర్) ముహూర్తం ఖరారైంది. 39వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనను ఈ ఏడాది డిసెంబర్ 18 నుంచి 28 వరకు లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ప్రకటించింది.
ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు రాంపల్లి రమేష్ వెల్లడించారు. సమాజ చైతన్యానికి అక్షరమే బలమైన ఆయుధమని వ్యాఖ్యానించారు.
"రాత అనేది ఆలోచనలకు పదును పెట్టే ఒక శక్తివంతమైన ఆయుధం. పుస్తక సంస్కృతిని విరివిగా వ్యాప్తి చేయడం, పాఠకాభిరుచిని పెంచడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత," అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంగా బుక్ ఫెయిర్ సొసైటీ నూతన కార్యవర్గాన్ని ఆయన మీడియాకు పరిచయం చేశారు. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.