భారతదేశం, జూలై 14 -- Hyderabad International Airport : భాగ్యనగర కీర్తికిరీటంలో మరో అంతర్జాతీయ మైలురాయి చేరింది. ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందించడంలో ఎప్పుడూ ముందుండే శంషాబాద్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (GHIAL) గ్లోబల్ స్థాయిలో అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే కుటుంబ సమేతంగా ప్రయాణించడానికి అత్యంత అనుకూలమైన, సౌకర్యవంతమైన విమానాశ్రయాల జాబితాలో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రపంచంలోనే 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది.

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ ప్రొవైడర్ సంస్థ 'అట్రాక్షన్‌టికెట్స్.కామ్' (AttractionTickets.com) నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో మన హైదరాబాద్ విమానాశ్రయానికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. విశేషం ఏమిటంటే... ఈ అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న కేవలం రెండు భారతీయ విమానాశ్...