Hyderabad : బాచుపల్లిలో విషాదం - సెప్టిక్ ట్యాంక్ లోకి దిగి ఊపిరాడక ముగ్గురు కార్మికులు మృతి
భారతదేశం, నవంబర్ 24 -- హైదరాబాద్ సిటీ శివారులోని బాచుపల్లిలో మంగళవారం తీవ్ర విషాదం నెలకొంది. ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోని సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు దిగిన ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు ఊపిరాడక దుర్మరణం పాలయ్యారు. విషవాయువులు పీల్చడమే వీరి మృతికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పొట్టకూటి కోసం పనికి వచ్చిన కార్మికులు ఇలా విగతజీవులుగా మారడం స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన పారిశుద్ధ్య కార్మికులు బాచుపల్లిలోని సదరు అపార్ట్మెంట్ సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసే పనికి వచ్చారు. ముందుగా ఓ కార్మికుడు ట్యాంక్‌లోకి దిగాడు. లోపల విషవాయువుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను ఉక్కిరిబిక్కిరై, కాపాడాలంటూ గట్టిగా కేకలు వేశాడు. అతని ఆర్తనాదాలు విన్న మరో ఇద్దరు సహచర కార్మికులు, అతని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.