Hyderabad : నకిలీ ఆధార్, పెళ్లి సర్టిఫికెట్లతో ఘరానా మోసం - షాదీ ముబారక్' నిధులు స్వాహా..!ఆర్ఐ సహా ఆరుగురు అరెస్టు
భారతదేశం, జూన్ 14 -- హైదరాబాద్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆసరాగా చేసుకుని భారీ మోసానికి పాల్పడుతున్న ఒక అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పేద ముస్లిం యువతుల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించే తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం 'షాదీ ముబారక్' ను టార్గెట్ చేసి, నకిలీ పత్రాలతో లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసిన ఆరుగురు నిందితులను హైదరాబాద్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. హసన్ నగర్లోని ఫాతిమా కాలనీలో మహ్మద్ ఎతెమాద్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి షాదీ ముబారక్ పథకానికి సంబంధించి నకిలీ దరఖాస్తులు, ఫోర్జరీ పత్రాలు సృష్టిస్తున్నాడనే నమ్మదగిన సమాచారం జూన్ 12న పోలీసులకు అందింది. ఈ పత్రాలను బండ్లగూడ తాసిల్దార్ కార్యాలయంలో సమర్పించి ప్రభుత్వ నిధులను తమ బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నట్లు తేలింది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.