భారతదేశం, నవంబర్ 25 -- Hyderabad Walks for Nasha Mukt Bharat : డ్రగ్స్ మహమ్మారి బారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ పిలుపునిచ్చారు. 'హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. డ్రగ్స్‌కు నో చెప్పి జీవితానికి ఎస్ చెప్పాలని యువతకు సూచించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి యువతే అతిపెద్ద బలమని వెంకటేష్ స్పష్టం చేశారు. యువత ముందుకు సాగేందుకు ప్రభుత్వం విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని గుర్తుచేశారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని కలలను, లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. అదే సమయంలో ప్రమాదకరమైన డ్రగ్స్ వ్యసనాల నుంచి యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు.

2029 నాటికి డ్రగ్స్ రహిత భారతదేశాన్ని నిర్మించాలనే లక్...