Hyderabad : జూబ్లీహిల్స్‌లోని పబ్‌లో అర్ధరాత్రి రచ్చ - రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ, సీన్ లో ఎంపీ సోదరుడు..!
భారతదేశం, సెప్టెంబర్ 7 -- హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ లో ఆదివారం రాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మద్యం మత్తులో ఇరువర్గాల వారు పరస్పరం కుర్చీలు, బీరు బాటిళ్లతో దాడులు చేసుకోవడంతో పబ్ వాతావరణం ఒక్కసారిగా భయానకంగా మారింది. ఈ ఘర్షణ ఘటనపై జుబ్లీహిల్స్ పోలీసులు మొత్తం మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సోదరుడు అరవింద్ కుమార్ యాదవ్ కూడా ఈ ఘటన జరిగిన సమయంలో అదే పబ్‌లో ఉన్నారు. ఎంపీ సోదరుడి సమక్షంలోనే ఇరువర్గాలు మాటమాటా పెరిగి భౌతిక దాడులకు దిగడం నగరంలో తీవ్ర కలకలం రేపింది. పబ్‌లో ఉన్న మిగతా కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. ఈ దాడులకు సంబంధించిన దృశ్యాలను అక్కడున్న కొందరు తమ ఫోన్లలో చిత్రీకరించగా, ఆ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వై...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.