భారతదేశం, మే 5 -- ACB Telangana : హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) పరిధిలో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం సామాన్యులను వేధిస్తూ, అందినకాడికి దండుకుంటున్న అధికారుల తీరుపై అవినీతి నిరోధక శాఖ (ACB) కొరడా ఝుళిపించింది. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని బోరబండ సర్కిల్-37 కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ (రెవెన్యూ/ట్యాక్స్) విభాగంలో పనిచేస్తున్న బి. శ్రీలత సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.

కేసు వివరాల్లోకి వెళ్తే.. ఒక బాధితుడు తన ఇంటి నిర్మాణానికి సంబంధించి అనుమతి పొందడం కోసం మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. ఈ ప్రక్రియను వేగవంతం చేసి, అనుమతి పత్రాలు చేతికి వచ్చేలా చూస్తానని శ్రీలత సదరు బాధితుడికి చెప్పారు. దీని కోసం రూ. 5 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

శ్రీలత డిమాండ్‌తో బాధిత...