Hyderabad : అక్రమ బోర్లపై 'హైడ్రా కొరడా' - కొనసాగుతున్న తొలిగింపు చర్యలు
భారతదేశం, నవంబర్ 3 -- హైదరాబాద్ శివార్లలో అక్రమ నీటి వ్యాపారంపై 'హైడ్రా' (HYDRAA) ఉక్కుపాదం మోపుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా బోర్లు వేసి, భూగర్భ జలాలను తోడేస్తూ భారీ దందా నడుపుతున్న అక్రమార్కుల ఆటకట్టించేందుకు చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ గ్రామ పరిధిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం హైడ్రా అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.
నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన 7 అక్రమ బోర్లను పైపులతో సహా అధికారులు తొలగించి, వాటిని పూర్తిగా పూడ్చివేశారు. వీటితో పాటు నీటిని నిల్వ చేసేందుకు ఏర్పాటు చేసిన 6 భారీ వాటర్ సంపులను జెసిబీల సహాయంతో పూర్తిగా ధ్వంసం చేశారు. అక్రమంగా నీటిని రవాణా చేస్తున్న పలు వాటర్ ట్యాంకర్లను సీజ్ చేయడంతో పాటు, ఈ దందా వెనుక ఉన్న బాధ్యులపై చట్టరీత్యా క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.