భారతదేశం, అక్టోబర్ 27 -- Husharu 2 Movie Teaser Released: తెలుగు తెరపై యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ల ట్రెండ్‌ను సరికొత్తగా మలిచిన చిత్రాల్లో 2018లో వచ్చిన 'హుషారు' ఒకటి. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమా, యువతకు బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు అదే జోష్‌తో, మరింత వినోదాన్ని పంచుతూ 'హుషారు 2' ప్రేక్షకుల ముందుకు రానుంది.

రచయిత, దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి హుషారు 2 సినిమాను డైరెక్ట్ చేశారు. తాజాగా హుషారు 2 సినిమా టీజర్‌ను మేకర్స్ ఇవాళ (అక్టోబర్ 27) విడుదల చేశారు. వినోదం, ఊహించని మలుపులు, అడ్వెంచర్‌తో నిండిన ఈ హుషారు 2 టీజర్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.

''ప్రతీ గడపకు ఓ క‌థ ఉంటుందంటారు.. కానీ ఈ చిత్ర‌గుంజ్‌లో ప్ర‌తీ గ‌డ‌ప‌కు ఒకే క‌థ‌... అంద‌రి ఇంటి పేరు ఒక్క‌టే భ‌యం. ఒక వైపు ర‌క్తంతో రాజ్యాన్ని ప‌రిపాలించే రాక్ష‌సుడు..మ‌రోవైపు అ...