భారతదేశం, మే 20 -- సాధారణంగా ఏ కంపెనీలోనైనా ఉద్యోగుల బాగోగులు చూసేందుకు, నియామకాలు చేపట్టేందుకు హెచ్ఆర్ విభాగం అత్యంత కీలకం. కానీ, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన 'బోల్ట్' (Bolt) కంపెనీ సీఈఓ ర్యాన్ బ్రెస్లో ఆలోచన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఫార్చ్యూన్ వర్క్‌ఫోర్స్ ఇన్నోవేషన్ సమిట్‌లో మాట్లాడిన ఆయన, తన కంపెనీ నుంచి హెచ్ఆర్ టీమ్‌ను పూర్తిగా సాగనంపినట్లు ప్రకటించారు.

"మా కంపెనీలో ఒక హెచ్ఆర్ టీమ్ ఉండేది. లేని సమస్యలను సృష్టించడమే వారి పనిగా ఉండేది. ఎప్పుడైతే వారిని తొలగించానో, ఆ సమస్యలన్నీ వాటంతట అవే మాయమయ్యాయి" అని 31 ఏళ్ల బ్రెస్లో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా కంపెనీలో పని సంస్కృతి మెరుగుపడిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఒకప్పుడు 11 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 92,000 కోట్లు) విలువ పలికిన బోల్ట్ కంపెనీ, ప్రస్తుతం 300 మిలియన్ ...