భారతదేశం, ఆగస్టు 16 -- బెంగళూరు ప్రజలకు ఇటీవలే ఊహించని షాక్ తగిలింది! పబ్లిక్​ రోడ్ల మీద పార్కింగ్ చేసే వాహనదారుల నుంచి ఏడాదికి రూ. 25వేల వరకు ఫీజు వసూలు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) పార్కింగ్ నిబంధనలు 2026 అమల్లోకి వస్తే, నగరవాసులకు పార్కింగ్ తలనొప్పులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ముసాయిదా నిబంధనలపై కర్ణాటక ప్రభుత్వం అభ్యంతరాలు, సూచనలను ఆహ్వానించింది.

ఈ ప్రతిపాదిత పార్కింగ్ ఛార్జీలు కేవలం వార్షిక ఖర్చులకే పరిమితం కాకుండా, ఇళ్ల ధరలు, అద్దెలు, కొనుగోలుదారుల నిర్ణయాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని రియల్​ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సొంత పార్కింగ్ స్థలం ఉన్న ఇళ్లకు భవిష్యత్తులో డిమాండ్ విపరీతంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

అన్నింటికన్నా ముఖ్యంగా.. అద్దెకు ఉండేవారిపై ఈ భారం తీవ్రంగా ఉండొచ్చు...