భారతదేశం, నవంబర్ 18 -- Horror Thriller OTT: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన లేటెస్ట్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ మూవీ 'ది వాన్'. థియేటర్లలో ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేసిన ఈ మూవీ.. ఇప్పుడు ప్రైమ్ వీడియో యూజర్లకు ఓ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.

బాలీవుడ్ లో డీసెంట్ హిట్ గా నిలిచిన ది వాన్ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది. అయితే ఇన్ని రోజులూ ఈ చిత్రం రెంట్ విధానంలో ఉంది. అంటే ప్రైమ్ వీడియో స‌బ్‌స్క్రిప్ష‌న్‌ ఉన్నా కూడా.. ది వాన్ సినిమాను చూడాలంటే ఎక్స్ ట్రా రెంట్ కట్టాల్సిందే.

ఇప్పుడు ది వాన్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్లు అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ మూవీపై ఉన్న రెంట్ ను తొలగించనున్నారు. నవంబర్ 20 నుంచి ప్రైమ్ సబ్ స్క్రైబర్లు అందరూ ఈ సినిమా ఎలాంటి రెం...