భారతదేశం, మే 22 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన పూర్వ వైభవాన్ని సంపాదించుకోవడమే లక్ష్యంగా హోండా కార్స్ సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో గట్టి పోటీనిచ్చేందుకు 'ZR-V' హైబ్రిడ్ మోడల్‌ను రంగంలోకి దించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హోండా ఎలివేట్ (Elevate) కంటే ఇది చాలా ప్రీమియం మోడల్. గ్లోబల్ మార్కెట్లో హెచ్ఆర్-వి (HR-V), సీఆర్-వి (CR-V) మధ్యలో ఉండే ఈ కారును జపాన్ నుండి నేరుగా భారత్‌కు దిగుమతి చేసుకుంటున్నారు.

హ్యుందాయ్ టక్సన్ (Tucson), జీప్ కంపాస్ (Jeep Compass), ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి లగ్జరీ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వడమే లక్ష్యంగా హోండా దీనిని తీర్చిదిద్దింది. ఈ కారు ధరలు, ఫీచర్ల వివరాలను పరిశీలిస్తే, ఇది హై-ఎండ్ ఎస్‌యూవీ ప్రియులను ఇట్టే ఆకట్టుకునేలా ఉంది.

ZR-V డిజైన్ విషయానికి వస్తే, ఇది చూడటానికి చాలా స్...