భారతదేశం, నవంబర్ 20 -- హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా భారత ప్రీమియం బైక్ మార్కెట్లో మరో సంచలనానికి తెరతీసింది. ఎంతో కాలంగా బైక్ ప్రియులు ఎదురుచూస్తున్న 'హోండా రెబెల్ 500' క్రూయిజర్ మోటార్ సైకిల్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఎక్స్-షోరూమ్ ప్రకారం దీని ప్రారంభ ధరను రూ. 4.49 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. స్టాండర్డ్ వేరియంట్‌తో పాటు అధునాతన ఈ-క్లచ్ వేరియంట్‌ను కూడా హోండా అందుబాటులోకి తెచ్చింది; ఈ-క్లచ్ మోడల్ ధర రూ. 4.89 లక్షలుగా ఉంది.

దేశవ్యాప్తంగా ఈ హోండా కొత్త బైక్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల కొనుగోలుదారులు కేవలం రూ. 5,000 టోకెన్ అమౌంట్ చెల్లించి హెచ్​ఎంఎస్​ఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా గానీ, అధీకృత 'హోండా బిగ్‌వింగ్' డీలర్‌షిప్‌ల వద్ద గానీ బైక్‌ను రిజర్వ్ చేసుకోవచ్చు. సంస్థ ప్రీమియం డీలర్‌షిప్ నెట్‌వర్క్ అయి...