భారతదేశం, మార్చి 23 -- ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా, భారత మార్కెట్​లో తన పట్టును మరింత పెంచుకునేందుకు అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత స్టాక్ క్లియరెన్స్‌లో భాగంగా హోండా సిటీపై కళ్లు చెదిరే ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

మీరు హోండా సిటీ సెడాన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే ఇదే సరైన సమయం! మార్చి 31, 2026 వరకు ఈ కారుపై రూ. 3 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. అయితే, ఈ డిస్కౌంట్లు కేవలం ఎంవై25 (మోడల్​ ఇయర్​ 2025) మోడళ్లకు మాత్రమే వర్తిస్తాయని గమనించాలి.

ఈ బెనిఫిట్స్​కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మీరు మీ సమీపంలోని హోండా డీలర్‌షిప్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

హోండా సిటీ ప్రారంభ ధర రూ. 11.95 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 16.07 లక్షల వరకు ఉంది (ఎక్స్-షోరూమ్).

ఇంజిన్: ఇందులో...