భారతదేశం, ఏప్రిల్ 29 -- Homemade Curd Tips : భారతీయ భోజనంలో పెరుగు లేనిదే ముద్ద దిగదు. ముఖ్యంగా ఎండలు మండిపోయే వేసవి కాలంలో చల్లటి పెరుగు ఇచ్చే హాయి వేరు. మార్కెట్లో రకరకాల డెయిరీ బ్రాండ్ల పెరుగు దొరుకుతున్నా, ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు రుచి, ఆరోగ్యం మాటాల్లో వర్ణించలేం.

చాలా మంది మహిళలు రాత్రి పాలను తోడు పెడితే ఉదయానికి పెరుగు సిద్ధమవుతుంది. అయితే..పెరుగు గడ్డకట్టిన తర్వాత పైన నీరు పేరుకుపోవడం చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. ఇలా కాకుండా ఐస్‌క్రీంలాంటి గడ్డ పెరుగును ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మన అమ్మమ్మలు, నాయనమ్మల కాలం నుండి వస్తున్న అత్యంత సులభమైన పద్ధతి పాలను సరిగ్గా మరిగించడం. పాలు ఎంత చిక్కగా ఉంటే పెరుగు అంత అద్భుతంగా వస్తుంది.

పెరుగు తోడుకున్న తర్వాత పైన నీరు కనిపిస్తుంటే.. ఒక చిన్న ట్రిక్ పాటిస్తే...