భారతదేశం, ఏప్రిల్ 12 -- హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భానుడి భగభగలకు తోడు భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో నగరంలో తాగునీటి డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి పౌరుడు నీటి వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు.

నగరంలోని పరిస్థితులపై అధికారులతో సమీక్షించిన ఆయన.. క్షేత్ర స్థాయిలో నీటి సరఫరా, ట్యాంకర్ బుకింగ్స్, డెలివరీ టైమ్ తదితర వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ వేసవిలో గత ఏడాది కంటే ఓవరాల్ గా ట్యాంకర్ బుకింగ్ పెరగకపోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లోని ఫిల్లింగ్ స్టేషన్ లలో గత ఏడాదికంటే బుకింగ్ పెరిగిందని చెప్పారు.

గత ఏడాది కంటే మణికొండ, బంజారాహిల్స్, డోయెన్స్, హఫీజ్ పేట్, నేతాజీ పార్క్ ఫిల్లింగ్ స్టేషన్లో బుకింగ్స్ పెరిగినట్టు వెల్లడించారు. ఈ పెండెన్సీ...