భారతదేశం, మార్చి 31 -- టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ హీరోగా, శివానీ నాగారం హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ "హే బ‌ల్‌వంత్‌" (Hey Balwanth). ఫిబ్రవరి 20, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు థియేటర్ రన్ పూర్తి చేసుకుని డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 ఈ హే బ‌ల్‌వంత్‌ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ముందే ప్రకటించినట్లుగా, ఈ రోజు మార్చి 31, 2026 నుంచి హే బ‌ల్‌వంత్‌ స్ట్రీమింగ్ ప్రారంభమైంది.

హే బ‌ల్‌వంత్‌ సినిమా నాలుగు భాషల్లో ఓటీటీలోకి రిలీజైంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉండటం విశేషం. దీనివల్ల సౌత్ ఇండియా వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈ కామెడీ డ్రామాను వీక్షించవచ్చు.

గోపి ఆచార్య దర్శకత్...