భారతదేశం, సెప్టెంబర్ 10 -- Heroine 1980: ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ డిజిటల్ రంగాన్ని, ప్రత్యేకించి పాప్ కల్చర్‌ను సరికొత్తగా శాసిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో '1980s రెట్రో లుక్ ఫొటో' ట్రెండ్ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హీరోయిన్లను ఏఐ వాడి ఆనాటి లుక్స్ లోకి మార్చి నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

సెలబ్రిటీల నుంచి కామనర్ల వరకు ఇప్పుడు ఈ 1980 రెట్రు లుక్ అనేది ట్రెండ్ గా మారింది. ప్రస్తుత తరం స్టార్ హీరోయిన్లను 80ల నాటి క్లాసిక్ సినిమా పోస్టర్లు, అనలాగ్ ఫిల్మ్ స్టిల్స్ తరహాలో రీ-ఇమాజిన్ చేస్తూ రూపొందించిన చిత్రాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

దక్షిణాది ముద్దుగుమ్మలు సమంత, సాయిపల్లవి, నయనతార, కీర్తి సురేష్, తమన్నా, రష్మిక మందన్నల ఫేస్‌లను 80ల నాటి కాటన్, పట్టు చీరలు, నాటి హెయిర్‌స్ట...