భారతదేశం, సెప్టెంబర్ 25 -- Suhas Director About Heroine Accident And Surgery: తమిళ చిత్రసీమలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రం 'మండాడి'. కమెడియన్ నుంచి హీరోగా మారిన సూరి, తెలుగు యంగ్ హీరో సుహాస్, సీనియర్ నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 10న థియేటర్లలోకి వచ్చి ఊహించని విజయాన్ని అందుకంది.

అయితే, ఈ సినిమా వెనుక మండాడిలో నటించిన హీరోయిన్ మహిమా నంబియార్ చూపించిన అసమాన అంకితభావం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన మండాడి సక్సెస్ మీట్‌లో దర్శకుడు మతిమారన్ నటి మహిమకు సంబంధించిన ఒక షాకింగ్ నిజం బయటపెట్టారు.

"ఈ సినిమాలో 'ఉసురే నీదాన్ పుల్లా' పాట చిత్రీకరణకు కేవలం ఐదు రోజుల ముందు మహిమా నంబియార్‌ తీవ్రమైన రోడ్డు ప్రమాద...