భారతదేశం, ఆగస్టు 27 -- Heroine: టాలీవుడ్‌లో రాబోతున్న కొత్త సినిమా 'సహ' (Sahaa) ప్రమోషన్లలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. సెప్టెంబర్ 4న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ (Swetha Lakshman) చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ మూవీ చూసిన తర్వాత మీరు డిసప్పాయింట్ అయితే అమీర్‌పేట సెంటర్లో గుండు కొట్టించుకుంటానంటూ చేసిన ఛాలెంజ్ ఆశ్చర్యం కలిగిస్తోంది.

హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మూవీ హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ మాట్లాడుతూ 'సహ' సినిమాపై ఎంతో కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసింది. ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైనా నిరాశపడితే, తాను స్వయంగా అమీర్‌పేట్ మెయిన్ రోడ్డుపై నిలబడి గుండు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని బాంబ్ పేల్చింది. అంత స్ట్రాంగ్ కంటెంట్ తీశామని, గట్టిగా కొట్...