భారతదేశం, మార్చి 26 -- తెలుగు వెండితెరపై ఫీచర్ ఫిల్మ్‌తో ఎంట్రీ ఇస్తున్న ఓటీటీ సిరీస్ డైరెక్టర్ మానస శర్మ. ఆమె తెరకెక్కించిన తొలి సినిమా రాకాస. హారర్ ఫాంటసీ కామెడీ చిత్రంగా రూపొందిన ఈ సినిమాను మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించారు. అనుదీప్ సంగీతం అందించారు.

రాకాస సినిమాలో మ్యాడ్ ఫేమ్ సంగీత్ శోభన్ సోలో హీరోగా చేశాడు. సంగీత్ శోభన్‌కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ నయన్ సారిక యాక్ట్ చేసింది. గెటప్ శ్రీను కీలక పాత్ర పోషించాడు. ఏప్రిల్ 3న రాకాస సినిమా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా రాకాస ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.

రాకాస ట్రైలర్ తెలుగు ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. ఇక మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రాకాస డైరెక్టర్ మానస శర్మ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ నయన్ సారిక గురించి, రాకాస...