భారతదేశం, మే 1 -- Hema Malini Emotional Tribute To Dharmendra Asha Bhosle: భారతీయ చలనచిత్ర రంగానికి సంబంధించిన అరుదైన దృశ్యరూపకాలను ప్రదర్శించే 'లెన్స్ అండ్ లెగసీ: బాలీవుడ్ ఇన్ ఫోకస్' ఎగ్జిబిషన్‌ను కేంద్ర సాంస్కృతిక శాఖ సహకారంతో ముంబైలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శనను బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ హేమ మాలిని ప్రారంభించారు. ఈ సందర్భంగా దివంగత నటుడు ధర్మేంద్ర, గాన కోకిల ఆశా భోంస్లేలకు నివాళి అర్పిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన 'ట్రిబ్యూట్ వాల్స్' అందరినీ ఆకట్టుకున్నాయి.

వేదికపై భర్త ధర్మేంద్ర గురించి మాట్లాడుతూ హేమ మాలిని కన్నీరు పెట్టుకున్నారు. "ఆయనతో గడిపిన క్షణాలను నా అదృష్టంగా భావిస్తాను. ఇప్పుడు ఆయన లేరనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. మిగిలిన జీవితాన్ని ఆయన లేకుండా ఎలా గడపాలో నాకు అర్థం కావడం లేదు" అని ...