భారతదేశం, జూన్ 1 -- Healthy Sleep Cycle Tips : మానవ శరీరానికి, మనస్సుకు ఆహారం, నీరు ఎంత అవసరమో.. ప్రశాంతమైన నిద్ర కూడా అంతే ముఖ్యం. మనం నిద్రపోతున్న సమయంలోనే మన శరీరం అంతర్గతంగా దెబ్బతిన్న కణాలను మరమ్మత్తు (రిపేర్) చేసుకుంటుంది. అలాగే మెదడు రోజంతా సేకరించిన సమాచారాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఈ కారణంగానే ప్రతి ఒక్కరూ రాత్రిపూట కనీసం 7 నుంచి 9 గంటలు, సగటున 8 గంటల పాటు ఖచ్చితంగా నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తుంటారు. అయితే, ఏ సమయంలోనైనా సరే 8 గంటలు నిద్రపోతే సరిపోతుందా.? అంటే.. అస్సలు సరిపోదని అంటున్నారు స్లీప్ మెడిసిన్ వైద్యుడు అబినాష్ జోషి. ఈ విషయమై ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పలు విషయాలను పంచుకున్నారు.

వైద్యుల నివేదిక ప్రకారం, మన శరీరానికి ఒక అంతర్గత గడియారం ఉంటుంది. దీనినే 'సిర్కాడియన్ లయ' (Circadian Rhythm) అంటారు. సాధా...