భారతదేశం, మార్చి 5 -- రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాక సంఘాల మహిళల హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ప్రారంభించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులకు సూచించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్యశాఖ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సెక్రటేరియట్లో మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష చేశారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకూ 99 రోజులపాటు చేపట్టనున్న కార్యక్రమాలపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ దిశానిర్దేశం చేశారు. హాస్పిటళ్లలో రోజువారీ వైద్య సేవలకు ఆటంకం కలగకుండా 99 డేస్ యాక్షన్ ప్లాన్ ఉండాలని సూచించారు. అధికారులు రూపొందించిన ప్రణాళికను స్వల్ప మార్పులతో మంత్రి ఆమోదించారు. మొత్తం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.