HDFC Bank Share: దూసుకెళ్తున్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు.. మరో 15% పెరిగే అవకాశం
భారతదేశం, సెప్టెంబర్ 15 -- దేశీయ స్టాక్ మార్కెట్లో లార్జ్ క్యాప్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు మంగళవారం ట్రేడింగ్లో దుమ్మురేపాయి. వరుసగా మూడో రోజూ కొనుగోళ్ల మద్దతు లభించడంతో షేరు ధర గణనీయంగా పుంజుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో గ్యాప్ అప్తో Rs.722.40 వద్ద ప్రారంభమైన షేరు, ట్రేడింగ్ మొదలైన కొన్ని నిమిషాల్లోనే Rs.730.75 ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. దీంతో ఒక్కరోజే 2.50 శాతానికి పైగా లాభపడింది. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో ఈ స్టాక్ సుమారు Rs.687 నుంచి Rs.730కి చేరి ఏకంగా 6 శాతానికి పైగా లాభాలను అందించింది.
బ్యాంక్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరడమే ఈ ర్యాలీకి ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బ్యాంక్ నూతన సీఈఓ ఎంపిక కోసం ఇద్దరి పేర్లను పరిశీలనకు పంపగా, భారతీయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.