HDFC AMC క్యూ1 లాభం రూ.837 కోట్లు.. 12 శాతం జంప్
భారతదేశం, జూలై 15 -- దేశీయ మ్యూచువల్ ఫండ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (HDFC AMC) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. బుధవారం (జూలై 15) విడుదల చేసిన నివేదిక ప్రకారం, జూన్ త్రైమాసికానికి కంపెనీ ఏకీకృత నికర లాభం గతేడాదితో పోలిస్తే 12 శాతం పెరిగి రూ.837 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.748 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటంతో దేశంలోని అతిపెద్ద ఫండ్ హౌస్‌లలో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఆదాయం, లాభాల వృద్ధిలో స్థిరత్వాన్ని ప్రదర్శిస్తోంది.
కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఏకీకృత ఆదాయం 13.6 శాతం వృద్ధితో రూ.1,100 కోట్లకు చేరింది. గతేడాది జూన్ త్రైమాసికంలో ఈ ఆదాయం రూ.968 కోట్లుగా నమోదైంది. ఆదాయంతో పాటే క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.