భారతదేశం, ఏప్రిల్ 16 -- ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (HDB Financial Services) తన నాలుగో త్రైమాసిక (Q4) ఫలితాలతో దలాల్ స్ట్రీట్‌లో ప్రకంపనలు సృష్టించింది. కంపెనీ లాభాల్లో భారీ వృద్ధిని నమోదు చేయడమే కాకుండా, ఆస్తుల నాణ్యత మెరుగుపడటం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచింది. ఈ సానుకూల పవనాలతో గురువారం ట్రేడింగ్‌లో కంపెనీ షేర్ ధర ఏకంగా 12.38 శాతం ఎగబాకి రూ. 724.00 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. మార్కెట్ విశ్లేషకులు ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు రావడంతో ఈ షేరుపై కొనుగోళ్ల ఒత్తిడి పెరిగింది.
2025-26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో హెచ్‌డీబీ ఫైనాన్షియల్ నికర లాభం రూ. 751 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో ఉన్న రూ. 531 కోట్లతో పోలిస్తే ఇది ఏకంగా 41.4 శాతం పెరుగుదల కావడం విశేషం. కేవలం లాభాలే క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.