భారతదేశం, నవంబర్ 28 -- కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఒకే వేదికపై కలిశారు. విరిద్దరూ ఇలా కలుసుకోవడం 21 ఏళ్ల తర్వాత జరిగింది. దీంతో ఇటు జగ్గారెడ్డి అభిమానులు, అటు హరీశ్ రావు అభిమానులు వీరిద్దరు కలిసిన ఫోటోలను వైరల్ చేస్తున్నారు. అయితే వీరిద్దరూ కలిసింది రాజకీయ వేదిక కాదు. జగ్గారెడ్డి కుమారుడి పెళ్లి వేడుక సందర్భంగా హరీశ్ రావు వెళ్లారు. జగ్గారెడ్డి కుమారుడు భరత్ సాయి రెడ్డి-కోడలు పాలక్ పటేల్‌ను హరీశ్ రావు ఆశీర్వదించారు. కాసేపు హరీశ్-జగ్గారెడ్డి మాట్లాడుకున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఈ నేతలిద్దరూ కలుసుకోవడంతో అందరిలోనూ రాజకీయపరమైన చర్చ మెుదలైంది. దీనిపై జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. '2004లో హరీశ్ రావు, నేను కలిసి ఆయన ఛాంబర్‌లో భోజనం చేసే వాళ్ళం. ఆ తర్వాత నేను కాంగ్రెస్‌లో వచ్చాక.. మళ్ళీ ఇప్పటి వరకు హరీశ్ రావుని కలవలేద...