భారతదేశం, మార్చి 9 -- మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన 'మంజుమ్మెల్ బాయ్స్' చిత్ర దర్శకుడు చిదంబరం ఎస్. పొదువల్ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. 2022లో ఒక యువతి పట్ల లైంగికంగా అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. కొచ్చి పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో చిదంబరం ఎస్‌కు తాజాగా న్యాయస్థానం నుంచి ఊరట లభించింది.

చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఎర్నాకులం జిల్లా సెషన్స్ కోర్టు, శనివారం (మార్చి 7) ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జిల్లా జడ్జి శ్రీ కె.కె. బాలకృష్ణన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. 2022లో చిదంబరం ఆమె అపార్ట్‌మెంట్‌లోకి అక్రమంగా ప్రవేశించి, తనపై లైంగిక దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. ఈ క్రమంలో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 74 (మహిళ గౌరవానికి భంగం కలి...