భారతదేశం, ఏప్రిల్ 22 -- Happy Raj OTT Release Date: మ్యూజిక్ సెన్సేషన్ జీవీ ప్రకాష్ కుమార్ లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హ్యాపీ రాజ్' డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా.. ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.

సంగీత దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన తాజా సినిమా 'హ్యాపీ రాజ్'. తెలుగమ్మాయి శ్రీ గౌరీ ప్రియ కథానాయికగా నటించిన ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా గత నెల మార్చి 27న థియేటర్లలో విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంది.

ముఖ్యంగా తండ్రీకొడుకుల మధ్య ఉండే ఎమోషన్స్‌ను దర్శకుడు మరియ రాజా ఇళంచెళియన్ అద్భుతంగా తెరకెక్కించారనే ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ 'అమెజాన్ ప...