భారతదేశం, జూన్ 28 -- Happy Journey Teaser: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో కేవలం హీరోల చుట్టూనే కాకుండా.. వైవిధ్యమైన, మహిళా ప్రాధాన్యత కలిగిన స్టోరీలకు క్రేజ్ బాగా పెరుగుతోంది. అదే బాటలో సరికొత్త వినోదాత్మక, హృదయాలకు హత్తుకునే కథాంశంతో రాబోతున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హ్యాపీ జర్నీ'. ఈ మూవీ టీజర్ ఇవాళ (జూన్ 28) రిలీజైంది.

అభిరామ్ పిల్లా దర్శకత్వంలో కంప్లీట్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా 'హ్యాపీ జర్నీ' తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఫ్లయింగ్ క్యాట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాతలు బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా రిలీజైన ఈ టీజర్ చాలా ఫ్రెష్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉంది.

హ్యాపీ జర్నీ సినిమా కథాంశం మొత్తం వేర్వేరు తరాలకు చెందిన, భిన్నమైన ఆలోచనలు ఉన్న కొందరు మహిళల చుట్టూ తిరుగుతుంది. ...