భారతదేశం, నవంబర్ 7 -- చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దివ్యమైన పండుగ దీపావళి. దివ్యమైన దీపాల కాంతులతో ప్రతి ఇల్లూ ఆధ్యాత్మిక శోభతో కనిపించే వేళ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలుపుకోవడం మన సంప్రదాయం. ఈ వెలుగుల పండుగ సందర్భంగా మీ ఆత్మీయులకు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, సందేశాల రూపంలో పంపేందుకు కొన్ని ప్రత్యేకమైన, ఆకట్టుకునే దీపావళి శుభాకాంక్షలు, మెసేజ్‌లను ఇక్కడ అందిస్తున్నాం.

"దివ్యదీపాల కాంతులు మీ జీవితంలోని అజ్ఞానమనే చీకట్లను తొలగించి, సంతోషం, సమృద్ధి, ఆరోగ్యమనే వెలుగులను నింపాలని ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు!"

"సిరిసంపదల దేవత ఆ లక్ష్మీదేవి దివ్య ఆశీస్సులతో మీ ఇల్లు నిరంతరం ధనధాన్యాలతో, సంతోషాలతో విలసిల్లాలని కోరుకుంటూ.. దీపావళి శుభాకాంక్షలు!"

ఈ ద...