భారతదేశం, నవంబర్ 21 -- Hanuman 2 Vs Jai Hanuman: ఒకే సినిమాకు ఒకే భాషలో రెండు వేర్వేరు సీక్వెల్స్ రావడం అసాధ్యమనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సినిమాకు ఒకే డైరెక్టర్ సీక్వెల్ తీస్తాడు. కానీ తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ 'హనుమాన్' విషయంలో మాత్రం ఊహించనిది జరుగుతోంది. ఈ చిత్రానికి రెండు వేర్వేరు సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి.

ఉప్పెన సినిమాతో అదరగొట్టిన పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్స్ ఇవాళ (నవంబర్ 21) ఓ సినిమాను ప్రకటించింది. ఆ సినిమా పేరు 'హనుమాన్ 2' కావడమే ఇక్కడ సంచలనం రేపుతోంది. 'హనుమాన్ 2- ది రైజ్ ఆఫ్ వానరాస్' పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి వీఐ ఆనంద్ డైరెక్టర్. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రొడ్యూసర్లు.

ఇదే ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్స్ గతంలో తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ సినిమాను తీసి హిట్...