భారతదేశం, ఏప్రిల్ 20 -- Hansika Motwani: దేశముదురు సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన హన్సిక మోత్వానీ.. తాజాగా ఒక ఇంటర్వ్యూ కారణంగా వార్తల్లో నిలిచింది. వ్యక్తిగత జీవితం నుంచి వృత్తిపరమైన విషయాల వరకు హన్సిక ఏది చేసినా అది చర్చనీయాంశంగానే మారుతోంది. సోహైల్ ఖతూరియాతో వివాహం, ఆ తర్వాత విడాకుల ప్రకటనతో అభిమానులను షాక్‌కు గురిచేసిన ఈ నటి.. తాజాగా గ్లామర్ ప్రపంచంలోని చీకటి కోణం 'కాస్టింగ్ కౌచ్'పై స్పందించింది. అయితే ఆమె చెప్పిన సమాధానం ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపింది.

ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హన్సిక మాట్లాడింది. ఈ సందర్భంగా హోస్ట్ ఆమెను పరిశ్రమలో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నించారు. "మీరు చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించడం వల్ల ఇలాంటి చేదు అనుభవాల నుంచి తప్పించుకున్నారా?" అని అడిగిన ప్రశ్నకు హన్సిక...