భారతదేశం, ఫిబ్రవరి 21 -- ఏపీలో ఎండలు పెరుగుతున్నాయి.! చలి తీవ్రత తగ్గిపోగా. క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు ఎండ తీవ్రత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒంటిపూట బడుల ప్రారంభంపై ఏపీ సర్కార్ ఫోకస్ నిర్ణయం తీసుకుంది.
మార్చి 16వ తేదీ నుంచి రాష్ట్రంలోని పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అధికారిక ఉత్తర్వలు వెలువడనున్నాయి.
ఒంటిపూట బడుల సమయంలో ఉదయం 8 గంటలకు పాఠశాలలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకూ తరగతులు నిర్వహిస్తారు. 12 గంటల 30 నిమిషాలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోనున్నారు.
మరోవైపు ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. పదో తరగతి పరీక్షలు జరిగే కేంద్రాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.