భారతదేశం, ఫిబ్రవరి 17 -- మార్చి 16 నుంచి తెలంగాణలో పాఠశాలలు ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉండనున్నాయి. ఒంటి పూట బడులు త్వరలోనే ప్రారంభంకానున్నాయి. లక్షలాది మంది విద్యార్థులకు మార్చి 16 నుండి ఉదయం పాఠశాల గంట మోగనుంది. ఆ రోజు నుంచి పాఠశాలల్లో ఒంటి పూట బడి అమల్లోకి వస్తుంది. మార్చి 15 ఆదివారం కావడంతో హాఫ్ డే స్కూల్ షెడ్యూల్ మార్చి 16 నుండి ప్రారంభమవుతుంది.

పాఠశాలలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పనిచేస్తాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం 12.30 గంటలకు అందిస్తారు.

అయితే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు కేంద్రాలుగా ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి ఎందుకంటే పరీక్షలు ఉదయం సెషన్‌లో జరుగుతాయి. పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ముందుగా మధ్యాహ్న భో...