H1N1 cases : దిల్లీని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ- ఆరు రెట్లు పెరిగిన కేసులు, కేంద్రం అలర్ట్
భారతదేశం, ఆగస్టు 23 -- దేశ రాజధాని దిల్లీలో హెచ్1ఎన్1 (స్వైన్ ఫ్లూ) కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నమోదవుతున్న స్వైన్ ఫ్లూ కేసులు ఏకంగా ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నాయని, పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీలో సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా వంటి వెక్టర్-బోర్న్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు.
వార్తా సంస్థ పీటీఐ అందించిన సమాచారం ప్రకారం.. దిల్లీలో ఈ ఏడాది ఇప్పటివరకు 2,300కి పైగా ఇన్ఫ్లూయెంజా-ఏ కేసులు నమోదయ్యాయి. వీటిలో 1,777కి పైగా స్వైన్ ఫ్లూ కేసులు ఉన్నట్లు తేలింది. ఒక్క గురువారం నాడే ఏకంగా 114 హెచ్1ఎన్1 కేసులు వెలుగుచూడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.