భారతదేశం, ఆగస్టు 23 -- దేశ రాజధాని దిల్లీలో హెచ్1ఎన్1 (స్వైన్ ఫ్లూ) కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నమోదవుతున్న స్వైన్ ఫ్లూ కేసులు ఏకంగా ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నాయని, పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీలో సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా వంటి వెక్టర్-బోర్న్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు.

వార్తా సంస్థ పీటీఐ అందించిన సమాచారం ప్రకారం.. దిల్లీలో ఈ ఏడాది ఇప్పటివరకు 2,300కి పైగా ఇన్‌ఫ్లూయెంజా-ఏ కేసులు నమోదయ్యాయి. వీటిలో 1,777కి పైగా స్వైన్ ఫ్లూ కేసులు ఉన్నట్లు తేలింది. ఒక్క గురువారం నాడే ఏకంగా 114 హెచ్‌1ఎన్‌1 కేసులు వెలుగుచూడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతో...