భారతదేశం, మార్చి 20 -- హైదరాబాద్ నగరంలో ఆహార భద్రతను పటిష్టం చేయడానికి, కల్తీని అరికట్టడానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల సమన్వయంతో 'హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్' (H-FAST) అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ విభాగాన్ని గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఐపీఎస్ ప్రారంభించారు. ఆహార కల్తీకి వ్యతిరేకంగా పక్కా సమాచారంతో, పటిష్టమైన యంత్రాంగం ద్వారా చర్యలు తీసుకోవడం ఈ విభాగం ప్రధాన ఉద్దేశం.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు ఎన్.రంజిత్ కుమార్ గౌడ్, అంజయ్య, సబ్-ఇన్‌స్పెక్టర్లు రమ్య, అభిలాష్, అఖిల్, కృష్ణ, ఇతర బృందం సభ్యులు పాల్గొన్నారు.

ఆహార కల్తీ లేదా అసురక్షిత ఆహార పదార్థాల గురించి సమాచారం అందించడానికి ప్రజల కోసం ప్రత్యేకంగా 8712661212 అనే టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశారు. పౌరు...