భారతదేశం, నవంబర్ 28 -- టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం తన కన్సల్టింగ్ విభాగంలోని చాలా పోస్టులకు అమెరికా వీసా, గ్రీన్‌కార్డ్ స్పాన్సర్‌షిప్‌ను నిలిపివేసే నిర్ణయం తీసుకుంది! సంస్థలో అతిపెద్ద విభాగమైన ఐబీఎం కన్సల్టింగ్‌పై ఈ నిర్ణయం ప్రభావం చూపుతుంది. దీనితో ప్రభావిత ఉద్యోగులు అమెరికా బయట ఉన్న పోస్టులనైనా అంగీకరించాలి లేదా కంపెనీ నుంచి వైదొలగాలి!

ఈ కన్సల్టింగ్ విభాగంలో 1,50,000 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు.

మేనేజర్లతో పంచుకున్న అంతర్గత పత్రాన్ని ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్ ఈ విషయాన్ని తొలుత వెల్లడించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో అమెరికా ఇమిగ్రేషన్ విధానాలపై అనిశ్చితి పెరుగుతున్న వేళ ఈ నిర్ణయం బయటకు వచ్చింది.

ఈ నిర్ణయం వల్ల ప్రభావితమైన హెచ్-1బీ వీసా హోల్డర్లకు నిర్ణయం తీసుకునేందుకు కేవలం మూడు వారాల గడువు ఇచ్చినట్లు సమాచారం. డిసెంబర...