భారతదేశం, ఆగస్టు 24 -- హెచ్-1బి (H-1B) వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి తెరలేపింది. కొత్తగా జారీ చేసే హెచ్-1బి వీసాలపై ఏకంగా $1,03,265 (సుమారు రూ. 87 లక్షలకు పైగా) ఫీజును శాశ్వతం చేయడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ప్రతిపాదనలు విడుదల చేసింది.

గత ఏడాది ఒక తాత్కాలిక ఉత్తర్వు ద్వారా ట్రంప్ ఈ విధానాన్ని తీసుకురాగా, ఫెడరల్ న్యాయస్థానం దాన్ని నిలిపివేసింది. తాజాగా నిబంధనల రూపంలో DHS ఈ ఫీజును అమల్లోకి తెచ్చేందుకు 30 రోజుల ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను ప్రారంభించింది. 2026 చివరి నాటికి ఈ నూతన ఫీజు విధానం ఖరారయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఒక హెచ్-1బి వీసా దరఖాస్తు కోసం అమెరికా కంపెనీలు సగటున $2,000 నుంచి $5,000 వరకు మాత్రమే ప్రభుత్వ రుసుము చెల్లిస్తు...