భారతదేశం, మే 14 -- భారతీయ ఐటీ నిపుణులకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు 'అమెరికా కల' అంటే ముందుగా గుర్తొచ్చే పేరు హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ ఆలయం. వీసా ఇంటర్వ్యూకి వెళ్లేముందు ఇక్కడ ప్రదక్షిణలు చేయడం దశాబ్దాలుగా వస్తున్న ఆచారం. అయితే, ఇప్పుడు ఈ పవిత్ర క్షేత్రాన్ని అమెరికాకు చెందిన ఓ సీనియర్ సెనేటర్ రాజకీయ వివాదంలోకి లాగారు. అమెరికాలోని మిస్సోరి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్ ష్మిత్, H-1B వీసా విధానాన్ని విమర్శిస్తూ చిలుకూరు ఆలయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

H-1B వీసా ప్రోగ్రామ్ వల్ల అమెరికన్ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎరిక్ ష్మిత్ ఆరోపించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన సుదీర్ఘ పోస్ట్‌లు చేస్తూ.. గ్లోబల్ స్థాయిలో ఒక 'వీసా కార్టెల్' నడుస్తోందని పేర్కొన్నారు. ఇందులో టెక్ కంపెనీలు, రిక్రూట...