భారతదేశం, మే 15 -- Gundu Sudarshan About Mr Work From Home Movie And Agriculture: తెలుగులో సీనియర్ నటుడుగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్నారు గుండు సుదర్శన్. ఎన్నో చిత్రాల్లో తన కామెడీ టైమింగ్‌తో అలరించిన గుండు సుదర్శన్ నటించిన లేటెస్ట్ టాలీవుడ్ మూవీ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్.

ఈ సినిమాలో హీరో త్రిగుణ్, హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ జోడీగా నటించారు. మధుదీప్ చెలికాని కథ, దర్శకత్వం వహించిన ఈ సినిమాను లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం నిర్మించారు. ఇవాళ (మే 15) థియేటర్లలో చాలా గ్రాండ్‌గా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ విడుదల అయింది.

అయితే, రిలీజ్‌కు రెండు రోజుల ముందు మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ పైసా వసూల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ మధుదీప్, వ్యవసాయం గురించి సీనియర్ నటుడు గుండు సు...