భారతదేశం, జూలై 30 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో విల్లా విజయ్ తప్పించుకోవడం గురించి మనోజ్, రోహిణి ఫీల్ అవుతారు. వాడు ఈ ఊరిలో ఎక్కడో ఉంటున్నాడు, పోలీసులు సరిగా వెతకడం లేదు. మనమే సరిగ్గా వెతకాలి. ఒకవేళ బాలుకు కనిపించి వాడు పట్టుకుంటే, వాడి వల్లే డబ్బు వచ్చిందంటాడు. ఆ క్రెడిట్ వాడికి పోకూడదు అని మనోజ్ అంటాడు.

ముందుగా డబ్బులు వాడికి వెళ్తే వాడు ఇస్తాడని గ్యారెంటీ లేదు. వాడు దొరకాలంటే నాకు అద్భుతమైన ఐడియా వచ్చింది. మనం వెళ్లి స్వామిజీని కలుద్దాం. అతను ఏదో దారి చూపిస్తాడని మనోజ్ అంటాడు. అదంతా అవసరమా అని ముందుగా వాదించిన రోహిణి.. మనోజ్ చెప్పడంతో ఒప్పుకుంటుంది. మరోవైపు సుమతి బస్ కోసం ఎదురుచూస్తుంటుంది.

అక్కడికే ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ వస్తాడు. సుమతిని చూసి కాల్ చేస్తాడు. కాల...