భారతదేశం, సెప్టెంబర్ 1 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రోహిణి, మనోజ్‌ను అనడంతో బాలు ఏదోటి అంటాడు. బాలును పక్కకి తీసుకెళ్లి అత్తయ్య చెప్పినట్లు మౌనికకు చాలా పనులు ఉంటాయి. వస్తాయని గ్యారెంటీ లేదంటుంది. అలా అనకను బాలు వెళ్లిపోతాడు.

మౌనిక కోసం చాలా సేపటి నుంచి అంతా ఎదురుచూస్తుంటారు. ఇంకెంత సేపు వెయిట్ చేయాలిరా అని మనోజ్ అంటాడు. మౌనిక రాదు కానీ శివ వస్తాడు. ఈసారి దేనిమీద కన్నేశావని శివను అవమానిస్తుంది ప్రభావతి. ఈసారి మా అమ్మను ఎత్తుకెళ్లి గోదాట్లో పడేయ్ అని బాలు అంటాడు. మనింట్లోనే పెద్ద దొంగల ముఠా ఉంది. ఇంకా వేరేవాళ్లను అంటున్నావా అని బాలు గడ్డిపెడతాడు.

దీన్నే చెప్పులిచ్చి మరి చెప్పుతో కొట్టించుకోవడం అంటారని సత్యం అంటాడు. గెస్టులు వచ్చినప్పుడు ఇలా అనొద్దని శ్రుతి అంటే.. ఈ ముష్...