భారతదేశం, సెప్టెంబర్ 22 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మీనా దగ్గరి నుంచి రూ. 5 లక్షలు రౌడీలు ఎత్తుకెళ్తారు. మీనా తలకు దెబ్బ తగిలి రక్తం కారడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్తారు ఫ్రెండ్స్. రౌడీలు చింతామణికి కాల్ చేసి దొంగతనం చేశామని చెబుతారు.

ఈసారి నాకు ఎదురైతే నిలబెట్టి పరువు తీసేస్తా అని చింతామణి అంటుంది. ఇప్పుడు ఈ ఆర్డర్ నాది అవుతుంది, మార్కెట్‌లో నా విలువ మరింత పెరుగుతుంది. నాతో పోటీకి రావాలంటే వణికిపోతారు అని చింతామణి అంటుంది. నూరు గుడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకు బలైపోతుంది అని అసిస్టెంట్ పంచ్ ఇస్తాడు.

అతన్ని తిడుతుంది చింతామణి. మేనేజర్ దగ్గరికి వెళ్లి మీనాకు ఐదు లక్షలు రావు. తను కచ్చితంగా రాదని చింతామణి అంటుంది. అంత కచ్చితంగా రాదని ఎలా చెబుతున్నారు అని మేనేజర్ అడిగితే అ...